Sunday, December 22, 2024

కూతుర్ని చూసేందుకు వెళ్తూ తల్లి మృత్యు ఒడికి..

- Advertisement -
- Advertisement -

మాడుగులపల్లి ః మాడుగుల పల్లి మండల పరిధిలోని కుక్కడం గ్రామంలో రైస్‌మిల్ ఎదురుగా ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  భార్య మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు.దీంతో స్థానికులు గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన దైద వెంకన్న లక్ష్మణరేఖ భార్య భర్తలు మిర్యాలగూడలోని గాంధీనగర్‌లో నివాసం ఉండేవారు. వీరికి ఒక కూతురు ఒక కుమారుడు భర్త వెంకన్న పట్టణంలో సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం గడిపేవాడు.

అయితే ఆదివారం కావడంతో నల్గొండలోని హాస్టల్లో ఉంటున్నటు వంటి తన కూతురు వద్దకు  మోటార్ సైకిల్‌పై భార్య భర్తలు వెళ్లుతుండగా సుమారు రెండు గంటల 30 నిమిషాల సమయంలో మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ శివారులో ఉన్నటువంటి రైస్ మిల్లు దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైనారు. మిర్యాలగూడెం నుండి నల్గొండ వైపు వెళ్లుతున్న టీఎస్05యుడి3559 గల లారీ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి  బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జనిగింది. ఈ ప్రమాదంలో భార్య దైద లక్ష్మణరేఖ అక్కడికక్కడే మృతిచెందగా భర్త వెంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వెంకన్నను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ ఆసుపత్రికి తరలిచారు.

స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి మిర్యాలగూడ రూరల్ సీఐ సత్యనారాయణ మాడుగులపల్లి ఎస్సై కైకూరి నరేష్ తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. మృతురాలి పోస్టుమార్టం కొరకు మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలించడం జరిగింది. మృతురాలి సోదరి అయినా లోకేశ్వరి ఫిర్యాదు మేరకు సంబంధిత లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేయడమైందని మాడుగులపల్లి ఎస్సై కైకూరి నరేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News