Friday, January 3, 2025

పులిదాడిలో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

పొలంలో పత్తి ఏరుతుండగా
వెనక నుంచి దాడి చేసిన పులి
తీవ్రంగా గాయపడిన మహిళా
కూలి ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూత
ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

మన తెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధి/కాగజ్‌నగర్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ మండలం, బెంగాలి క్యాంపు 6 నెంబర్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన మో ర్లే లక్ష్మిపై పులి దాడి చేయడంతో మృతి చెం ది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం రైతు కూలీలతో కలిసి పత్తి ఏరడానికి ఆమె వెళ్లింది. అందరితో కలిసి పత్తి ఏరుతుండగా వెనుక నుండి వచ్చిన పులి ఒకేసారి ఆమెపై దాడి చేసింది. దీంతో అక్కడే ఉన్న మిగతా కూలీలు గట్టిగా అరవడంతో పు లి అక్కడి నుండి పారిపోయింది. తీవ్ర గాయాలైన మహిళను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో మృ తి చెందింది.

దీంతో  మృతురాలి బంధువులు, గ్రామస్థులు మృతురాలి కుటుంబాన్ని అదుకోవాలని డిమాండ్ చేస్తూ కాగజ్‌నగర్ పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వీరికి వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. దీంతో జిల్లా అటవీశాఖ ఆధికారి నీరజ్ చోప్రా పులి దాడిలో మృతి చెందిన మహిళ కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, 10 లక్షల రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించడంతో ఆందోళనను విరమించారు. దహన సంస్కారాల కోసం 20 వేల రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News