Sunday, December 29, 2024

రైలు ఢీకొని మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: రైలు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం జగిత్యాల జిల్లాలో  చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మల్యాల మండలం పోతారం గ్రామంలో చిన్న పల్లె శివారులో రైలు ఢీకొని రాజరాం గ్రామానికి చెందిన బక్క శెట్టి రాజవ్వ అక్కడిక్కడే మృతి చెందింది. రైలు ఆమెను పట్టాలపై కొంత దూరం లాక్కెళ్లింది. దీంతో ఆమె శరీరం నుజ్జు నుజ్జు అయి చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News