Thursday, January 16, 2025

కూకట్‌పల్లిలో చిన్నారిని కాపాడబోయి.. మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి అడ్డగుట్టలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చెట్టుమీద విద్యుత్ వైర్లు పడటంతో విద్యుదాఘాతం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది. శ్రీలక్ష్మి(05) అనే చిన్నారి ఆడుకుంటూ చెట్టును పట్టుకుంది. చిన్నారిని రక్షించేందుకు వెళ్లిన బాపనమ్మ(35) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి శ్రీలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. స్థానికుల సమాచారంతో ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News