Sunday, December 22, 2024

పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మహిళ మృతి (వీడియో)

- Advertisement -
- Advertisement -

వివాహ వేడుకలో ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ఆకస్మికంగా మృతి చెందింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలోని బఖారీ గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి, 60 ఏళ్ల మహిళ వేదికపై డ్యాన్స్ చేస్తూ అపస్మారక స్థితికి చేరుకుంది. చుట్టుపక్కల వారు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అక్కడికి తీసుకెళ్లేలోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మహిళకు గుండెపోటు వచ్చిందని, దీంతో ఆమె చనిపోయిందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News