Sunday, December 22, 2024

పిడుగు పడి మహిళ మృతి..

- Advertisement -
- Advertisement -

వాంకిడిః మండలంలోని ఖేడేగాం మన్నేవార్ గ్రామ శివారులో పిడుగుపడి అదే గ్రామానికి చెందిన గెడం పద్మబాయి (32) అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పద్మబాయి తన భర్త టుల్లితో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లింది. మద్యాహ్నం పత్తి చేనులో యూరియా వేస్తుండగా ఉరుములతో కూడిన వర్షం పడడంతో సమీపంలో ఉన్న చింత చెట్టుకింద నిలబడి ఉండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో అమె అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వాంకిడి పోలీసులు అక్కడికి చేరుకోని విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News