Saturday, December 21, 2024

పాము కాటుకు మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

చింతలమానేపల్లి: పాముకాటుకు మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ ఈకులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని హేటిగూడకు చెందిన లోడెల్లి లలిత (53) అదివారం తెల్లవారు జాము బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చి నిద్రపోయింది.

ఉదయం అయితే లేవకపోయోసరికి భర్త మధుకర్ ఏమైందని లలితను అడగడంతో బాత్‌రూంకు వెళ్లి వచ్చినప్పటి నుండి ఎదో కుట్టినట్టు అనిపించిందని తెలుపడంతో అమెకు పాము కాటు వేసిన కాట్లను గుర్తించి సిర్పూర్ ఆసుపత్రికి తరళించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News