Wednesday, January 22, 2025

విమానంలో మహిళపై లైంగిక వేధింపులు: ప్రొఫెసర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి దుబాయ్ వెళుతున్న విమానంలో ఒక మహిళా డాక్టర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఒక 47 ఏళ్ల ప్రొఫెసర్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు శుక్రవారం ఒక అధికారి వెల్లడించారు. ఈ ఘటన గత బుధవారం సంభవించినట్లు ఆయన చెప్పారు.

ఢిల్లీ నుంచి సాయంత్రం 5.30 గంటలకు టేకాఫ్ అయిన విమానంలో 24 ఏళ్ల బాధితురాలు, నిందితుడు పక్కపక్క సీట్లలో కూర్చున్నారని పోలీసు అధికారి తెలిపారు. విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడానికి కొద్ది సేపటికి ముందు నిందితుడు తనను అసభ్యంగా తాకాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరి మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుందని, బాధితురాలు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వారు జోక్యం చేసుకున్నారని ఆ అధికారి వివరించారు. విమానం ముంబై విమానాశ్రయంలో దిగిన తర్వాత వారిద్దరూ సహార్ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా ఆయనకు మంజూరు అయిందని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఆ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News