Sunday, December 22, 2024

అయ్యవారిపల్లి వాగులో మహిళ గల్లంతు

- Advertisement -
- Advertisement -

ఫరూఖ్‌నగర్: రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి వాగులో ఓ మహిళ గల్లంతైన సంగటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొందుర్గు మండలం ఆగిర్యా గ్రామానికి చెందిన గుమ్మడి నిర్మల (35) అనే మహిళ మంగళవారం అయ్యవారిపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో గ్రామంలోని వాగు వంతెనపై నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో దూకిందని పరిసర పంట పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న పలువురు గ్రామ సర్పంచ్ లక్ష్మీరమేష్‌కు తెలపడంతో వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించగా ఎస్‌ఐ దేవకీ ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ శాఖ బృందం, గజ ఈతగాళ్ల సాయంతో మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 5గంటల పాటు గాలింపు చర్యలు సాగిన మహిళ అచూకీ మాత్రం తెలియరాలేదు. ఇక మహిళ ఎందుకు ఇలాంటి చర్యకు పూనుకుందో తెలియాల్సి ఉంది. మహిళ భర్త ఎల్లయ్యతో పాటు ఓ కూతురు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News