Monday, December 23, 2024

ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను 22 రోజుల పాటు నిర్భంధించి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉత్తరాఖాండ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను 22 రోజుల పాటు నిర్భంధించి అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరఖాండ్ లోని హరిద్వార్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానిక పోలీసుల కథనం ప్రకారం..ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన వివాహిత మహిళకు నమీద్ అనే వ్యక్తితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. గత కొంత కాలంగా ఒకరితో ఒకరు సంభాషించుకునే వారు. ఈ క్రమంలో ఉద్యోగం ఇప్పిస్తానని నదీమ్ ఆమెకు చెప్పాడు.

దీంతో మహిళ జులై 7 నమీద్ తో హరిద్వార్ కు వచ్చింది. ఉద్యోగం ఇప్పించకపోగా మహిళను నమీద్ ఇంట్లో 22 రోజులపాటు బంధించారు. నమీద్ స్నేహితుడైన షకీబ్ ఆమెకు మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశారు. ఎలాగో అలా వారి చెర నుంచి తప్పించుకున్న బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు చికిత్స అందించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News