- Advertisement -
హైదరాబాద్: చాదర్‌ఘాట్ పరిధిలోని ఓల్డ్ మలక్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. సొంత అక్క, అన్నపై తమ్ముడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. శ్రీ వెంకటరమణ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న అక్క లక్ష్మీ, అన్నలపై వారి తమ్ముడు మదన్ బాబు కత్తితో దాడి చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీ మృతి చెందగా.. అన్న గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. కుటుంబ కలహాల కారణంగానే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
- Advertisement -