నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనవరి 1వ తేదీ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రక్క నుంచి ఓ మహిల నడచుకుంటూ వెళ్తండగా.. ఎదురుగా దూసుకొచ్చిన ఓ కారు ఆమెను ఢీకొట్టి రెండు మూడు పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కారు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.