Wednesday, January 22, 2025

వికారాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో ప్రియురాలి గొంతు నులిమి..

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: జిల్లాలోని పరిగి మండలంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మండలంలోని రూప్ ఖాన్ పేట్ లో శ్యామలమ్మ అనే మహిళను ఆమె ప్రియుడు చంద్రమౌళి హత్య చేశాడు. మద్యం మత్తులో శ్యామలమ్మ గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా శ్యామలమ్మ, చంద్రమౌళి సహజీవనం చేస్తున్న సమాచారం.

విషయం తెలుసుకుని వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News