Sunday, February 23, 2025

ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం.. మహిళ సజీవదహనం

- Advertisement -
- Advertisement -

ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి ఓ మహిళ సజీవదహనమైంది. ఈ దారుణ సంఘటన గద్వాలలోని ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరు వైపు వెళ్తుండగా అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో మరో 14మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వెంటనే బస్సుల్లో ఉన్న ప్రయాణికులను కాపాడి బయటికి తీసుకొచ్చారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సబ్బింది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. నిద్రమత్తులో డ్రైవర్ బస్సు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News