Friday, January 10, 2025

రైల్వే పరిహారం కోసం భర్త బతికున్నాచనిపోయాడన్న భార్య

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశా ప్రభుత్వం, రైల్వే శాఖ ప్రకటించిన నష్టపరిహారం డబ్బుల
కోసం బాలాసోర్ రైలు ప్రమాదంలో తన భర్త చనిపోయాడని మాయమాటలు
చెప్పిన ొక మహిళ చిక్కుల్లో పడింది.

జూన్ 2న బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో తన భర్త బిజయ్
దత్తా మరణించాడని చెప్పిన కటక్ జిల్లాలోని మనియబంధకు చెందిన
గీతాంజలి దత్తా అనే మహిళ తన భర్త మృతదేహాన్ని కూడా గుర్తించింది.
అయితే పత్రాల పరిశీలన సమయంలో ఆమె చెప్పేదంతా బూటకమని
తేలిపోయింది.

కాగా..పోలీసులు ామెకు వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టినప్పటికీ ఆమె భర్త
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె చిక్కుల్లో పడింది. అరెస్టు నుంచి
తప్పించుకునేందుకు ప్రస్తుతం ఆ మహిళ పరారీలో ఉంది.

గత 12 సంవత్సరాలుగా గీతాంజలి, ఆమె భర్త బిజయ్ విడిగా ఉంటున్నారని
పోలీసులు తెలిపారు. ప్రభుత్వ సొమ్మును కాజేయడానికి
ప్రయత్నించడమేగాక తాను చనిపోయినట్లు అబద్ధం చెప్పిన తన మాజీ
భార్యపై చర్యలు తీసుకోవాలని బిజయ్ మనియబంధ పోలీసు స్టేషన్లో
ఫిర్యాదు చేశారు. సంఘటన బాలాసోర్ జిల్లాలో జరగడంతో బహనాగ పోలీసు
స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా బిజయ్ కు సూచించినట్లు మనియబంధ
పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ బసంత్ కుమార్ సత్పథి తెలిపారు.

మృతదేహాలపై తప్పుడు వివరాలు సమర్పించే వారిపై కఠిన చర్యలు
తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆర్ కె జేన రైల్వేలు, ఒడిశా పోలీసులను
ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News