Monday, December 23, 2024

అమ్మో బతికిపోయింది !…రైలు ప్రయాణికురాలిని కాపాడిన హోంగార్డు!!

- Advertisement -
- Advertisement -

woman saved

న్యూఢిల్లీ: ముంబైలోని సబర్బన్ రైలులో అప్రమత్తమైన హోంగార్డు… కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయిన మహిళా ప్రయాణికురాలిని రక్షించాడు. రైలు నుంచి దూకిన మహిళ ప్లాట్‌ఫారమ్‌పై పడ్డంతో బ్యాలెన్స్‌ కోల్పోయింది. బ్యాలెన్స్‌ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మహిళ రైలు ప్రవేశ ద్వారంలోని హ్యాండిల్‌ను వదలకుండా అలాగే పట్టుకుని ఉంది.  రైలు ఊపందుకోవడంతో, మహిళను ముందుకు లాక్కెళ్లింది, దాంతో ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది. కాగా అదే రైలులో ఉన్న హోంగార్డు వెంటనే రైలు దిగి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఉన్న గ్యాప్‌  నుంచి ఆమెను లాగి ఆమె ప్రాణాలను కాపాడాడు.

ముంబైలోని జోగేశ్వరి స్టేషన్‌లో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. హోంగార్డు అప్రమత్తంగా వ్యవహరించినందుకు అతనికి రివార్డు లభించిందని ముంబై పోలీస్ కమిషనర్ (రైల్వేస్) క్వాజర్ ఖలీద్ తెలిపారు. ఆ మహిళను కాపాడిన హోంగార్డును అల్తాఫ్ షేక్‌గా గుర్తించారు. “16/4/22న జోగేశ్వరి స్టేషన్‌లో సబర్బన్ రైలు ఎక్కే సమయంలో (డి) పడిపోయిన ఒక మహిళా ప్రయాణికురాలిని @grpmumbaiలో పనిచేస్తున్న హోమ్ గార్డ్ అల్తాఫ్ షేక్ రక్షించాడు. అతని చురుకుదనం, విధి పట్ల అంకితభావంకు అతనికి రివార్డ్ ఇవ్వబడుతోంది, ” అని జనాబ్ ఖలీద్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News