Sunday, January 19, 2025

పండగ పూట విషాదం… చెరువులో పడి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/ముప్కాల్ : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో సంక్రాంతి పండగ ఒక కుటుంబంలో విషాదం నెలకొంది. గురడి కాపురెడ్డి కుటుంబంలో మహిళ తప్పిపోయిందనే విషయం కాస్త కుటుంబాన్ని ఆమె మరణ వార్త శోకసంద్రంలో ముంచేసింది. గురువారం ఇంటి నుండి వెళ్లిన బద్దం సాయవ్వ (52) అనే మహిళ శుక్రవారం గ్రామ చెరువులో పడి శవమై తేలింది. ఒక్కసారిగా ఆమె కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె గత కొన్ని రోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతుందని, దానితోనే ఇంటి నుండి బయటకు వెళ్లిందనే విషయం తెలిపారు. అంతకు ముందు భర్త బద్దం చిన్న హన్మాండ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News