Monday, December 23, 2024

ఫోన్ స్నాచర్‌తో పోరాడిన ఢిల్లీ యువతి

- Advertisement -
- Advertisement -

Woman fights to phone snatcher in Delhi

న్యూఢిల్లీ: ఓ యువతి స్నాచర్‌తో పోరాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన గురువారం ఆగ్నేయ ఢిల్లీలోని బదర్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… తిక్రీ నివాసిగా గుర్తించబడిన ఒక మహిళ తాజ్‌పూర్ పహారీ వద్ద తన స్నేహితుడి వద్దకు వెళుతోంది. అకస్మాత్తుగా, ఒక స్నాచర్ ఆమె వద్దకు చేరుకుని ఆమె నుండి మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. ధైర్యంగా ఆ వ్యక్తిని అతని టీ షర్టు పట్టుకుని, వారి మధ్య జరిగిన గొడవలో మొబైల్ కింద పడింది. స్నాచర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News