Friday, December 20, 2024

కొడుకుపై కోపంతో నామినేషన్ వేసిన తల్లి

- Advertisement -
- Advertisement -

కొడుకుపై కోపంతో ఎన్నికల్లో నామినేషన్ వేసిందొక తల్లి. జగిత్యాలలో 82 ఏళ్ల చీటి శ్యామల అనే వృద్ధురాలు తన కొడుకు నిర్వాకం గురించి పదిమందికీ తెలియలనే ఉద్దేశంతో ఇలా నామినేషన్ వేశారు. ఆమె తన బంధువులతో కలసి వచ్చి, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం క్యూరిక్యాల గ్రామానికి చెందిన శ్యామల.. తన పెద్ద కొడుకు శ్రీరాంరావు తనపై కోర్టు కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నాడని తెలిపారు. ఆస్తి కోసం కొడుకు తనపై కేసు పెట్టడంతో ప్రస్తుతం తాను అద్దె ఇంట్లో ఉండవలసి వచ్చిందనీ, ఈ విషయం అధికారులకు, ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో నామినేషన్ వేశానని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News