Thursday, December 26, 2024

23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం సంఘటన బుధవారం తెల్లవారుజామున యమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్థరాత్రి నోయిడా నుంచి షేర్ ట్యాక్సీలో వెళుతున్నానని, మార్గమధ్యంలో ఇతర ప్రయాణికులు దిగి ఒంటరిగా ఉన్న తర్వాత ట్యాక్సీ డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని యువతి పోలీసులకు తెలిపింది . యువతి బుధవారం ఉదయం ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ముగ్గురు వ్యక్తులు తనను సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు ఆగ్రా పోలీసు కమిషనర్ ప్రీతీందర్ సింగ్ తెలిపారు.

నోయిడాలోని ఒక ప్రైవేట్ గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్న యువతి తన స్వగ్రామానికి ఫిరోజాబాద్ మీదుగా 360 కి.మీ దూరంలో ఉన్న ఔరయ్యకు వెళ్లాల్సి ఉన్నందున, ట్యాక్సీ డ్రైవర్ తనను ఫిరోజాబాద్‌లో దింపేందుకు ఒప్పుకున్నడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అర్ధరాత్రి కావడంతో టాక్సీ ఎక్కిన తర్వాత డ్రైవర్ తన ఇద్దరు స్నేహితులను పిలిచాడని ఆమె చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన జైవీర్, టిటు మరియు చాచా అనే టాక్సీ డ్రైవర్‌తో సహా ముగ్గురు సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News