Friday, April 4, 2025

ఒకే కాన్పులో ముగ్గురు కవలలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /తాడ్వాయి : సాధారణ కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు జన్మించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మండలంలోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని గొత్తికోయ గూడెంకు చెందిన మడకం గంగమ్మకు పురిటి నొప్పులు రావడంతో తాడ్వాయి పీహెచ్‌సీ కి డెలివరీ కోసం తీసుకువచ్చారు. వైద్యాధికారి చిరంజీవి, స్టాప్ నర్సు ప్రశాంతి సాదరణ డెలివరీ చేయగా, ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు.

ముగ్గురిలో ఒకరు చాల తక్కు బరువు ఉండడంతో మృతి చెందగా, తల్లి మిగతా ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యాధికారి చిరంజీవి తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం పిల్లలను వరంగల్ ఎంజీఏం ఆస్పత్రిలో చేర్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సాదరణ కాన్పులో ముగ్గురు కవలలు జన్మించడం అరుదైనదిగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు. గొత్తికోయ మహిళకు సాదరణ డెలివరీ చేసిన వైద్య సిబ్బందిని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అభినందించారు. తల్లి, పిల్లల ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News