Sunday, December 22, 2024

మహిళకు ప్రసవం చేసిన ఎంఎల్ఎ వంశీకృష్ణ

- Advertisement -
- Advertisement -

అచ్చంపేటః నాగర్‌కర్నూల్ జిల్లా, లింగాల మండలం, జిలుగుపల్లి తండాకు చెందిన ప్రసన్న అనే 9 నెలల గర్భిణికి స్థానిక ఎంఎల్‌ఎ వంశీకృష్ణ ప్రసవం చేయించారు. వివరాల్లోకి వెళ్తే… సదరు మహిళ ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకునే స్థోమత లేక కడుపులో ఉన్న పిండానికి మెడకు పేగు చుట్టుకోవడంతో ఆపరేషన్ ఇబ్బందికరంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న స్వతహాగా వైద్యుడైన స్థానిక ఎంఎల్‌ఎ వంశీకృష్ణ హాస్పిటల్‌ను సందర్శించి వెంటనే ఆమెకు అచ్చంపేట ఏరియా హాస్పిటల్‌లో శుక్రవారం సాయంత్రం ప్రసవం చేయించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళ కుటుంబ సభ్యులు ఎంఎల్‌ఎకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News