- Advertisement -
బెర్లిన్ : మధ్య ప్రాచ్య నుంచి జర్మనీ లోని రమ్‌స్టెయిన్ విమానాశ్రయానికి వెళ్తున్న ఎయిర్ సి17 సైనిక విమానంలో అఫ్గాన్ మహిళ ఆడ బిడ్డను ప్రసవించిందని అమెరికా మిలిటరీ వెల్లడించింది. అఫ్గాన్ నుంచి ప్రజలను తరలించడానికి రవాణా స్థావరంగా ఈ విమానాశ్రయం ఉపయోగపడుతోంది. శనివారం నాడు విమానంలో ఆ మహిళ ప్రసవ వేదన భరిస్తుండగా, విమానంలో గాలి ఒత్తిడి పెరిగితే , ప్రసవం స్థిరంగా సాగుతుందని తల్లిబిడ్డ క్షేమంగా ఉంటారన్న ఉద్దేశ్యంతో విమానం ఎగురుతున్న ఎత్తును కమాండర్ తగ్గించి ప్రసవానికి సహకరించాడని మిలిటరీ పేర్కొంది. రమ్‌స్టెయిన్ విమాన స్థావరానికి విమానం చేరుకోగానే అమెరికా వైద్యాధికారుల బృందం విమానానికి వచ్చి ప్రసవం సుఖంగా జరిగేలా చికిత్స అందించారు.
- Advertisement -