Sunday, January 5, 2025

కొవిడ్‌తో మృతి చెందిన భర్త… అతడి వీర్యంతో బిడ్డకు జన్మనిచ్చిన భార్య

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ లోని భీర్‌భూమ్ జిల్లాలో కొవిడ్‌తో మరణించిన భర్త వీర్యం ఆధారంగా భార్య నడివయసులో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐవిఎఫ్ పద్ధతిలో ఈ ప్రక్రియ జరిగింది. మురారై ప్రాంతానికి చెందిన సంగీత (48), అరుణ్ ప్రసాద్‌లకు 27 ఏళ్ల క్రితమే వివాహం జరిగినా సంతానం కలగలేదు. సంగీతకు గర్భాశయ సమస్యలు ఉండడంతో ఐవీఎఫ్ ప్రక్రియలో సంతానాన్ని పొందాలని దంపతులు నిర్ణయించుకున్నారు.

ఈమేరకు రెండేళ్ల క్రితం అరుణ్ ప్రసాద్ వీర్యాన్ని కోల్‌కతా లోని ఓ ల్యాబ్‌లో భద్రపరిచారు. ఆ తరువాత కొవిడ్ సోకి భర్త అరుణ్ మరణించారు. భర్త మరణం, అత్తింటివారి నిరాదరణతో కుంగిపోయిన సంగీతకు తన భర్త నడిపే కిరాణా దుకాణమే దిక్కయింది. ఒంటరితనంతో బతుకుతున్న సంగీతకు భద్రపరిచిన భర్త వీర్యంతో బిడ్డను కనాలని నిర్ణయించుకుని వైద్యులను సంప్రదించింది. దాంతో అరుణ్ వీర్యాన్ని అండం లోకి ప్రవేశ పెట్టడం ద్వారా సంగీత గర్భవతి అయింది. డిసెంబర్ 12 న రాంపుర్ హాట్ వైద్య కళాశాల ఆస్పత్రిలో సంగీత మగబిడ్డను ప్రసవించింది. తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News