Thursday, January 23, 2025

108లో ప్రసవించిన మహిళ..

- Advertisement -
- Advertisement -

వాజేడు : 108లో మహిళ ప్రసవించిన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని బిజినేపల్లి గ్రామానికి చెందిన కురుసం నాగిని కి పురిటి నొప్పులు రావడంతో భర్త సూరిబాబు 108 కు సమాచారం అందించారు.

దీంతో 108 సిబ్బంది సకాలంలో వచ్చి వాజేడు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకు వెళ్తున్న క్రమంలో జగన్నాధపురం సమీపంలోని చేపల చెరువు వద్ద పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి ,బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఈఎంటి వినోద్ కుమార్, ఫైలట్ రాధాస్వామి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News