- Advertisement -
జైపూర్: ఒకే కాన్పులో నలుగురు జన్మించిన సంఘటన రాజస్థాన్‌లో వాజిర్‌పూర్‌లో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం… కిరణ్ కన్వర్ అనే నిండు గర్బిణీకి పురటి నొప్పులు రావడంతో వాజిర్‌పూర్‌లోని అయుష్మాన్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. గర్బిణీకి తొమ్మిది నెలల నిండడంతో నొప్పులు ఎక్కువ కావడంతో ఆపరేషన్ చేశారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు ఆ తల్లికి నలుగురు పిల్లలు జన్మించారు. ముగ్గురు పిల్లల బరువు సమానంగా 1350 గ్రాములు ఉండగా నాల్గో శిశువు బరువు 1650 గ్రాములు ఉందని వైద్యులు వెల్లడించారు. బరువు తక్కువగా ఉన్న ముగ్గురు పిల్లలను మెరుగైన వైద్యం కోసం జనన ఆస్పత్రికి తరలించారు. నాల్గో శిశువు ఆరోగ్యంగా ఉండడంతో తల్లి వద్దనే ఉంచారు.
Also Read: పురిట్లోనే చనిపోయిన బిడ్డ 42 ఏళ్ల తర్వాత తల్లిని కలిస్తే…
- Advertisement -