Wednesday, April 2, 2025

కేన్స్‌లో మహిళ అర్ధనగ్నంగా నిరసన

- Advertisement -
- Advertisement -

Woman half-naked protest in Cannes

కేన్స్: ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికులు పాల్పడుతున్న అత్యాచారాలకు నిరసన తెలియచేస్తూ ఒక మహిళ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై దుస్తులు విప్పి అర్ధనగ్నంగా నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఉక్రెయిన్ జాతీయ పతాకంలోని రంగులు పూసుకుని, స్టాప్ రేపింగ్ అస్(మాపై అత్యాచారాలు ఆపండి) అన్న అక్షరాలను తన శరీరంపై రాసుకుని ఆ మహిళ శుక్రవారం ఒంటరిగా రెడ్ కార్పెట్‌పై ఎరుపు రంగు అండర్‌ప్యాంట్స్‌తో నిలబడడంతో వెంటనే భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో రెడ్ కార్పెట్‌పై తారల ప్రదర్శనకు కొద్ది సేపు అంతరాయం ఏర్పడింది. జార్జ్ మిల్లర్ నిర్మించిన త్రీ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ లాంగింగ్ అనే హాలీవుడ్ చిత్రం ప్రీమియర్‌కు హాజరయ్యేందుకు వచ్చిన టిల్డా స్వింటన్, ఇడ్రీస్ ఎల్బాతో సహా కొందరు తారలు రెడ్ కార్పెట్ వెలుపలే కొద్దిసేపు ఉండిపోవలసి వచ్చింది. రష్యా సేనలు ఆక్రమించిన ప్రాంతాలలో చిన్నారులతోసహా వందలాది మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు సమాచారం అందిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ గత నెల ఆందోళన వ్యక్తం చేశారు. తన దేశానికి ఆర్థికంగా సాయమందించాలని కోరుతూ జెలెన్‌స్కీ ఒక వీడియో సందేశాన్ని మంగళవారం ప్రారంభమైన కేన్స్ ఫెస్టివల్‌కు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News