Wednesday, January 22, 2025

భర్తను కొట్టి.. ఉరేసుకొని భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /లక్షెట్టిపేట: తాగిన మైకంలో భర్తతో గొడవపడి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని మహిళా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం చెల్లంపేట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భీమక్క అనే 35సంవత్సరాల మహిళ.. అదే గ్రామానికి చెందిన జైనేని రవితో 20 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. అయితే వారికి పిల్లలు పుట్టలేదు. ఇద్దరు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

రోజు అతిగా మద్యం సేవించి గోడవపడుతారని.. మృతురాలు తాగిన మైకంలో భర్తపై చేయి చేసుకుంటుందని స్థానికులు, కుటుంబీకులు చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇద్దరు తప్పతాగి గోడవపడ్డారు. అయితే, తన భర్తను కొట్టి భార్య.. రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకొని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలు తమ్ముడు చేదం రాజన్న పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News