Monday, January 20, 2025

ఉరి వేసుకొని మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

వర్గల్: ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వర్గల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మోయిన్‌కు ఐదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పన్నెండెళ్ల క్రితం అతని పెద్ద కూతురు హుస్సెన్‌బీ (30)ను ఉస్మాన్ ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు సంతోషంగా జీవించారు. తర్వాత తరుచూ ఇంట్లో గోడవలు జరిగేవని తెలిపారు. అదే రోజు రాత్రి హుస్సెన్ బీ కనబడకుండా పోయింది. ఉస్మాన్ నిద్ర లేని చూసే సరికి తన బార్య కనిపించకపోవడంతో చుట్టు పక్కల వెలికాడు. వర్గల్ శివారులోగల చింతల బస్తీలో గోపాల్ రెడ్డి వ్యవసాయ పొలం వద్ద హుస్సెన్‌బీ తన చున్నీతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు. ఆర్థిక సమస్యల కారణంగా తన కూతురు భర్తతో గొడవ పడి జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకొని చనిపోయిందని పేర్కొన్నారు. ఈ విషయం సూసైడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News