Monday, January 20, 2025

కలెక్టర్ అవ్వాలనుకుంది.. ఇంతలోనే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంకు చెందిన పూజిత శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాయల్ విల్లాస్ కాలనీలో అద్దెకు ఉంటుంది. కలెక్టర్ కావాలని కలలు కనింది. అందుకు ఆమె సివిల్స్ పరీక్షల కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సోమవారం అనుమానస్పద స్థితిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి యజమాని గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. గతంలో ఓ వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండేదని మృతికి గల కారణం అతడే కావచ్చని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News