Monday, January 20, 2025

క్షణాల్లో మహిళను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళను హైదరాబాద్ పోలీసులు కాపాడారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకుని ఆమెను ప్రాణాన్ని కాపాడారు. సమయానికి సీపీఆర్ అందించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే మహిళ బలవన్మరానికి పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మహిళ ఆస్పత్రిలో కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News