Monday, December 23, 2024

విషాదం: అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు భరించలేక నందినీ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గత కొన్న రోజులుగా అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు పెట్టడంతో గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. నీ బిడ్డ చనిపోయింది వచ్చి శవాన్ని తీసుకొని వెళ్లండంటూ భర్త ఫోన్ చేయడంతో కర్ణాటక నుంచి మృతిరాలి తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు.

తమ బిడ్డను చిత్ర హింసలు పెట్టి భర్త, అత్తమామలు హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ నందినీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒంటిపై గాయాలు ఉన్నాయని, అతి దారుణంగా నా బిడ్డను కొట్టి చంపేసారని వారు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డను చంపడమే కాకుండా ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారని. కేసు వాపస్ తీసుకోకపోతే చంపుతామంటూ కాల్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భర్త రత్నదీప్ ను పోలీసులు అరెస్టు చేశారు. అత్తమామ విజయ, లక్ష్మన్ రావు పరారీలో ఉన్నారు. 304 బి సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News