Friday, December 20, 2024

మొండెం లేని తల మిస్టరీ వీడలేదు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసి నది సమీపంలో లభించిన మొండెం లేని తల కేసులో మీస్టరీ ఇంక వీడలేదు. బాధిత యువతి తల మాత్రమే దుండగులు అక్కడ వదిలేయడంతో మొండెం, హత్యకు గురైన మహిళ ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. మృతురాలి ఆచూకీ తెలుసుకునేందుకు 8 బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు మహళ తలతో పోస్టర్లను ముద్రించి వాటిని పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఆమె గురించి ఆరా తీస్తున్నారు.

మలక్‌పేట, సైదాబాద్, చాదర్‌ఘాట్, పాతబస్తీలో మలక్‌పేట పోలీసులు తిరిగారు. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్, శంకర్‌నగర్, మూసానగర్‌లో పోలీసులు ఇంటింటికి తిరుగుతూ పోస్టర్‌ను చూపించి వివరాలు అడుగుతున్నారు. అలాగే నగర శివారులోని పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు. ఆయా పోలీస్ స్టేషన్లకు హత్యకు గురైన మహిళ తల ఫొటోను పంపించి ఆరా తీస్తున్నారు. హత్యకు గురైన మహిళ వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, ముస్లిం మహిళగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News