- Advertisement -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్ లో చోటుచేసుకుంది. జగిత్యాలలోని బుడిగజం కాలనీకి చెందిన తూర్పాక తిరుపతమ్మ(40) అనే మహిళ రోడ్డు దాటుతుండగా నిజామాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన తిరుపతమ్మను వెంటనే స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించారు. అయితే, అప్పటికే తిరుపతమ్మ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్స ఉంది.
- Advertisement -