Wednesday, January 22, 2025

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తార్నాకలో ఆర్టీసీ బస్సు మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ప్రమాదానికి కారణమైన కుషాయిగూడ డిపో ఆర్టీసీ డ్రైవర్‌ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News