Wednesday, January 22, 2025

బురఖాతో వచ్చి బంకర్‌పై బాంబు

- Advertisement -
- Advertisement -

Woman in burqa threw a bomb at CRPF bunker and fled

 

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని సోపోరే బురఖాతో వచ్చిన మహిళ సిఆర్‌పిఎఫ్ బంకరుపై బాంబు విసిరి ఫరారయింది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బుధవారం అక్కడి వీడియోల ద్వారా దుండగురాలిని గుర్తించారు. అక్కడి కెమెరాలలో రికార్డు అయిన వీడియో ఆధారంగా ఈ మహిళను సిఆర్‌పిఎఫ్ గుర్తించింది. బాంబు దాడి ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఆస్తినష్టం జరగలేదని వెల్లడైంది. కశ్మీర్ ఐజిపి విజయ్‌కుమార్ ఘటన గురించి విలేకరులకు తెలిపారు. పారిపోయిన ఆగంతకురాలి కోసం గాలిస్తున్నామని తొందరలోనే అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఘటన వీడియో ఆధారంగా చూస్తే ఈ మహిళ రోడ్డుపై వేగంగా వెళ్లుతూ మిలిటరీ బంకర్ వద్దకు రాగానే ఆగి నిలిచి తన దుస్తులలో దాచుకున్న బాంబు తీసి విసిరింది. తరువాత అక్కడి నుంచి పారిపోయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News