Thursday, February 20, 2025

అదనపు కట్నం కోసం ఇంత దారుణమా..!

- Advertisement -
- Advertisement -

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నప్పటికీ.. ఇంకా కొన్ని చోట్ల మాత్రం వరకట్న వేధింపులు, అత్యాచారాలు, గృహహింసలకు గురవుతూనే ఉన్నారు. అలాంటి ఓ దారుణమైన సంఘటనే ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. తాము అడిగినంత అదనపు కట్నం ఇవ్వలేదనే కోపంతో అత్తమామలు కలిసి కోడలికి హెచ్‌ఐవి ఇంజక్షన్ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. 2023 ఫిబ్రవరి 15వ తేదీన యువతికి.. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్‌తో వివాహం అయింది.

అప్పుడు కట్నంగా రూ.15 లక్షలు ముట్టజెప్పారు. కానీ, కొంతకాలానికి స్కార్పియో వాహనం కొనుగోలు చేసేందుకు మరో రూ.25 లక్షలు కట్నంగా తేవాలని కోడలిని వేధించడం మొదలుపెట్టారు. అయితే అంత సొమ్ము ఇచ్చుకోలేమని అనడంతో ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. ఆ తర్వాత ఊరి పెద్దలు కలగజేసుకోవడంతో తిరిగి ఇంట్లోకి రానిచ్చారు. కానీ, కట్నం కోసం ఆ యువతిని శారీరకంగా, మానసికంగా వేధించడం మాత్రం ఆపలేదు. ఎంతకీ ఆమె డబ్బు తీసుకురాకపోడంతో హత్య చేసేందుకు వ్యూహం రచించారు.

ఇందులో భాగంగా హెచ్ఐవి వైరస్‌తో కూడిన కలుషితమైన ఇంజిక్షన్‌ను ఆమెకు చేశారు. కొంతకాలానికి ఆమె అనారోగ్యం పాలు కావడంతో ఆస్పత్రికి వెళ్లగా అక్కడు ఆమెకు హెచ్‌ఐవి ఉన్నట్లు తేలింది. కానీ, ఆమె భర్తకు నిర్వహించిన పరీక్షలో మాత్రం నెగెటివ్‌ అని వచ్చింది. ఇది తెలిసి యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వాళ్లు స్థానిక కోర్టును ఆశ్రయించడంతో పోలీసులు అభిషేక్, అతని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై వరకట్న వేధింపులు, హత్యయత్నం వంటి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News