Monday, December 23, 2024

దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ అరెస్టు

- Advertisement -
- Advertisement -

ముస్తాబాద్: వృద్ధమహిళలను టార్గెట్ చేస్తు పలు దొంగతనాలకు పాల్పడుతున్న మహిళను అరెస్టు చేసినట్లు సిఐ ఉపేందర్ తెలిపారు. ఈమేరకు సదరు మహిళ వద్ద నుంచి రెండు కేసులకు సంబంధించి 38.06 గ్రాముల బంగారం, 8తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు కేసులలో స్వాధీన పర్చుకున్న వాటి వివరాలు తెలియజేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రోజున ముస్తాబాద్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా, అనుమానస్పదంగా కనిపించిన గంభీరావుపేట గ్రామానికి చెందిన పాటి సునీత(49)ను పట్టుకుని విచారించగా, తాను గంభీరావుపేట గ్రామ నివాసిని అని తెలిపినట్లు పేర్కొన్నారు.

సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని, వృద్ద మహిళల వద్ద నుండి సులువుగా దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. మొదటికేసులో బంగారు గుండ్లు(20), హెనెలు(04), పుస్తె(01), వెండి గాజుల(04)బంగారు పడిగెలు(02), రెండవ కేసులో బంగారు చైన్ ఒకటి, పుస్తె ఒకటి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ రెండు కేసులలో కీలకపాత్ర పోషించిన చంద్రశేఖర్, రాజశేఖర్, శ్రీనివాస్, కుమార్, దామోదర్, వెంకటేష్‌లను సిఐ అభినందించా రు.

అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వ్యక్తుల మీద పోలీస్ వారికి సమాచారం అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది చంద్రశేఖర్, రాజశేఖర్, శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News