Sunday, January 19, 2025

విష పాము కాటుకు మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

నాగిరెడ్డిపేట్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన అచ్చన్నపల్లి సాయవ్వ 54 అనే మహిళ విషపాము కాటుతో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సాయవ్వ మంగళవారం సాయంత్రం తన ఇంట్లో పందికొక్కులు తవ్విన రంద్రాలు పూడ్చే క్రమంలో ప్రమాదవశాత్తు ఏదో గుర్తు తెలియని విష పాము కాటేసింది. దీంతో వెంటనే ఆమెకు చికిత్స మిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి ఆమె మరణించినట్లు తెలిపారు. పందికొక్కులు తవ్విన గుంతలను పూడుస్తుండగా విషపాము కాటేయండంతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News