Monday, December 23, 2024

ప్రతి 11 నిమిషాలకో మహిళ బలి

- Advertisement -
- Advertisement -

ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా మహిళలపై కొనసాగుతున్న వివక్ష, హింసపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి 11 నిమిషాలకు ఓ మహిళ/ బాలిక తన సన్నిహితులు లేదా కుటుంబబీకుల చేతుల్లో హత్యకు గురవుతోందని పేర్కొంది, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై జరుగుతున్న హింసే అత్యంత విస్తృతమైనదని అభిప్రాయపడింది, ‘ మహిళలపై హింస నిర్మూలన దినం’( నవంబర్ 25న) పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఈ వ్యాఖ్యలు చేశారు.‘ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసే అత్యంత విస్తృతమైంది. ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక తన సన్నిహితులు లేదా సొంత కుటుంబీకుల చేతుల్లోనే బలవుతోంది.

కరోనా మహమ్మారి మొదలుకొని ఆర్థిక సంక్షోభం వరకు వారిపై భౌతిక ంగా, మౌఖికపరమైన దాడులు పెరగడానికి మరింత కారణమవుతున్నాయి’ అని గుటెరస్ అన్నారు. మహిళలు, బాలికలపై ఆన్‌లైన్ హింస కూడా ప్రబలంగా ఉందన్న ఆయన లైంగిక వేధింపులతో పాటుగా మహిళల వస్త్రధారణ, ఫోటోల వంటి వాటి విషయాల్లో ఎన్నో రకాలయిన దాడులు జరుగుతున్నాయన్నారు. ‘మానవాళిలో సగమైన మహిళలపై జరుగుతున్న ఈ వివక్ష, హింస, వేధింపుల వల్ల మనం తీవ్రమైన మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది.ఇది మహిళలు జీవితంలోని అన్ని రంగాల్లో పాలు పంచుకోకుండా చేస్తోంది. వారి మౌలిక హక్కులు, స్వేచ్ఛలను హరించి వేస్తోంది.

మన ప్రపంచానికి అవసరమైన సమానమైన ఆర్థిక రికవరీని సైతం ఇది అడ్డుకుంటోంది’ అని గుటెరస్ అన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను చరిత్ర పుస్తకాల్లోకి పంపించాల్సిన సమయం వచ్చిందన్న ఐరాస చీఫ్.. ఇందుకు ప్రపంచ దేశాలన్నీ శంఖారావం పూరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల ఇందుకోసం ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఈ క్రమంలో మహిళల హక్కుల సంస్థలు, ఉద్యమాలకు నిధులను 2026 నాటికి 50 శాతానికి పెంచాలన్నారు. ప్రతి ఒక్కరూ మహిళలకు అండగా నిలవాలని, వారి హక్కులకు మద్దతుగా తమ వాణిని వినిపించాలని, తామంతా ఫెమినిస్టులమని గర్వంగా ప్రకటించాలని గుటెరస్ పిలుపునిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News