Wednesday, April 16, 2025

మహిళా జర్నలిస్ట్‌పై ఇసుక మాఫియా దాడి

- Advertisement -
- Advertisement -

ఒక యూట్యూబ్ చానెల్ కోసం పని చేస్తున్న ఒక మహిళా జర్నలిస్ట్‌పై మహారాష్ట్ర సముద్ర తీర రత్నగిరి జిల్లాలో ఇసుక మాఫియా దాడి చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఈ సంఘటన ఆదివారం జరిగిందని అధికారి ఒకరు తెలిపారు. స్వాతిహద్కర్‌గా గుర్తించిన బాధితురాలు చిప్లున్‌లో ఒక నదిలో అక్రమంగా ఇసుక తవ్వకం పని వీడియోల చిత్రీకరణకు వెళ్లినట్లు ఆయన తెలియజేశారు. ‘ఆ ప్రదేశఃలో ఇసుక మాఫియాసభ్యులు కొందరు ఆమెపై దాడి చేశారు. దానితో ఆమెను హుటాహుటిని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు’ అని ఆయన చెప్పారు.

స్వాతి హద్కర్ అంతకుముందు చిప్లున్ ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకం వ్యవహారాల గురించి పలు వార్తా కథనాలు రాశారని ఆయన తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు చిప్లున్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదు చేశారు. దర్యాప్తు సాగుతోంది. 2023 ఫిబ్రవరిలో ‘మహానగరి టైమ్స్’ జర్నలిస్ట్ శశికాంత్ వారిషె (48) రత్నగిరి జిల్లా రాజాపూర్‌లో ఒక భూమి డీలర్ నడిపిన ఒక ఎస్‌యువి కిందపడి మరణించారు. ఆయన నిందితునిపై వ్యాసం రాశారని, దానితో నిందితుడు ఆగ్రహించాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News