Wednesday, November 6, 2024

భార్యాభర్తల గొడవ.. 9వ అంతస్థు నుంచి దూకిన భార్య

- Advertisement -
- Advertisement -

woman jumps from ninth floor residence in Ghaziabad

ఘజియాబాద్ : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ పెద్ద హైడ్రామాకు దారి తీసింది. 9వ అంతస్తు నుంచి కిందకు దూకిన ఆమెను భర్త గట్టిగా పట్టుకొని కాపాడటానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. విజయనగర్ ప్రాంతంలోని సేవియర్ సొసైటీలో ఫరాజ్ హసన్, సాదియా దంపతులు నివసిస్తున్నారు. 9వ అంతస్తులోని ప్లాటులో ఉంటున్నారు. మంగళవారం నాడు వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన సాదియా.. వేగంగా పరిగెత్తి బాల్కనీ తలుపు తీసి అక్కడి నుంచి కిందకు దూకేసింది. అయితే ఆమె వెనుకే వేగంగా వచ్చిన ఫరాజ్ వెంటనే స్పందించి సాదియా చెయ్యి పట్టుకున్నాడు. దీంతో ఆమె కింద పడకుండా ఆగింది.

భార్య చెయ్యి పట్టుకొని ఆమె కింద పడకుండా కాపాడిన ఫరాజ్ పెద్దగా కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. ఇది చూసిన సొసైటీలోని స్థానికులు వెంటనే తమ ఇళ్లలోని పరుపులు, దుప్పట్లు తీసుకొచ్చి ఆ బిల్డింగ్ కింద పరిచారు. ఆ తర్వాత చెయ్యి జారడంతో ఆమెను వదిలేశాడు. దీంతో 9వ అంతస్తు నుంచి సాదియా కింద పడిపోయింది. పరుపులపై పడినప్పటికీ ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెను నోయిడాలోని ఒక ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఈ ఘటన మొత్తాన్ని సొసైటీలోని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో బుధవారం వైరల్ అవడంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

woman jumps from ninth floor residence in Ghaziabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News