Monday, December 23, 2024

ఇద్దరు కూతుళ్లతో నదిలో దూకి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఆదివారం ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నదిలో దూకి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదిగుబ్బ మండలం గడ్డంపల్లి తండా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ తన పిల్లలతో కలిసి బండ్‌పై నుంచి సరస్సులోకి దూకింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా వెతికిన తర్వాత మృతదేహాలను బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం తరలించారు.

మృతులను సుకన్య (35), ఆమె కుమార్తెలు దేవయాని (10), జస్మిత (9)గా గుర్తించారు. ఈ కుటుంబం ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందినది. ఇంటి సమస్యల కారణంగానే మహిళ, ఆమె కుమార్తెలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సుకన్య భర్త గంగాధర్ ఆమెతో తరచూ గొడవపడేవాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఆమె ఇద్దరు కూతుళ్లతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News