Friday, December 20, 2024

పట్టపగలు అందరు చూస్తుండగానే.. అమ్మాయి కిడ్నాప్ (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

పట్టపగలు అందరు చూస్తుండగానే ఓ అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అమ్మాయి కిడ్నాప్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్వాలియర్ లో పెట్రోల్ బంక్ వద్ద ఓ వ్యక్తి బైక్ పై ఉండగా, మరో వ్యక్తి అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి బైక్ పై ఎక్కించి తీసుకెళ్లిన విజువల్స్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న సీసీటీవి కెమెరాలో రికార్డయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాకు చెందిన 19ఏళ్ల అమ్మాయిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకోవడానికి భింద్‌కు వెళ్లింది. గ్వాలియర్ లోని నాకా చంద్రావడ్ని పెట్రోల్ పంపు వద్ద తన సోదరుడి కోసం ఎదురుచూస్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు.. బాదితురాలిని బలవంతంగా బైక్ పై ఎక్కించి కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకుని అమ్మాయిని కాపాడేందుకు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎసిపి క్రైమ్ రిషికేశ్ మీనా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News