Saturday, December 21, 2024

సినీ ఫక్కీలో కిడ్నాప్.. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లిన దుండగులు

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని చుంచుపల్లి మండలం జాతీయ రహదారిపై సినీ ఫక్కిలో మహిళ కిడ్నాప్ కు గురైంది. తన భర్తతో కలిసి ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసేందుకు ఓ కళాశాలకు ఆటోలో వెళ్తున్న క్రమంలో కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.

ఆటోను అడ్డగించి భర్తపై దాడి చేసి మహిళను కారులో ఎత్తుకుపోయారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఖమ్మంకు చెందిన సన్ని, కొత్తగూడెంకు చెందిన మాధవిలు ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News