Wednesday, January 22, 2025

నార్సింగిలో మహిళ కిడ్నాప్‌… కారులో బలవంతంగా మద్యం తాగించి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ మహిళపై కొందరు గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం… రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని పీరం చెరు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఎర్రటి కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఆమెకు మద్యం తాగించి, కారులో అత్యాచారం చేశారు. గండిపేట సమీపంలో ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లే ముందు ఆమె బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లినట్లు సమాచారం. అనంతరం స్పృహలోకి వచ్చిన బాధితురాలు జరిగిన దారుణాన్ని తన భర్తకు తెలియజేసింది. బాధితురాలి భర్త వెంటనే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సహాయంతో కేసు దర్యాప్తు చేపట్టారు. గంటల వ్యవధిలోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News