Monday, January 20, 2025

టివి యాంకర్ కిడ్నాప్ కేసులో తృష్ణ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

టీవీ యాంకర్ ప్రణవ్ ను కిడ్నాప్ చేసిన నిందితురాలు తృష్ణ పోలీసులకు చిక్కింది. ప్రణవ్ ను పెళ్లి చేసుకునేందుకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 11న యాంకర్ ప్రణవ్ ను కొందరు బంధించారని ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. తృష్ణ నుంచి తప్పించుకుని ప్రణవ్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితురాలు తృష్ణ డిజిటర్ మార్కెటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. మాట్రిమోని వెబ్ సైట్ లో ప్రణవ్ ఫొటోలు చూసి తృష్ణ ఇష్టపడింది. ప్రణవ్ ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. తృష్ణను అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News