Friday, January 24, 2025

మహిళను లైంగికంగా వేధించి…. రైళ్లో నుంచి నెట్టేశాడు…

- Advertisement -
- Advertisement -

Woman Killed After Being Thrown Out of Moving Train

ఛండీగఢ్: ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు నడుస్తున్న రైళ్లో నుంచి ఆమెను బయటకు నెట్టేయడంతో మృతి చెందిన సంఘటన హర్యానా రాష్ట్రం ఫతేబాద్‌లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 30 ఏళ్ల మహిళ తన కుమారుడితో కలిసి రోహతక్ నుంచి తోహానాకు రైళ్లో వెళ్తుంది. మార్గం మధ్యలో ఓ వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించాడు. ఆమె ప్రతిఘటించడంతో రైలు నుంచి బయటకు నెట్టేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కుమారుడి సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌పి ఎ మోడీ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News