Sunday, December 22, 2024

మహిళలను కొట్టిచంపిన గుర్తుతెలియని వ్యక్తులు

- Advertisement -
- Advertisement -

మహిళను బండరాళ్లతో కొట్టిచంపిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చెందిన సక్కుబాయి అనే మహిళ రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల వెతికినా కూడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సక్కుబాయి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మహిళను హత్య చేసిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దుండిగల్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News