మక్తల్ : మక్తల్ పట్టణ శివారు ప్రాంతం కాటన్‌మిల్ సమీపంలో ఈనెల 4న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కావలి లక్ష్మీ(47) కేసును మక్తల్ పోలీసులు చేధించారు. ఆభరణాల కోసమే నిందితుడు ఆమెను నిర్మాను ష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించా రు. మక్తల్ సిఐ కె.రాంలాల్ బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను తెలిపారు. మక్తల్ పట్టణంలోని యాదవనగర్‌కు చెందిన కావలి లక్ష్మీని, బిసి కాలనీకి చెందిన ధూపం బుగ్గప్ప(34) అనే యువకుడు స్థానిక కల్లు దుకాణం వద్ద పరిచయం చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే లక్ష్మీ ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలపై కన్నేసిన బుగ్గప్ప ఈనెల 4న సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఆమెను తన బైక్‌పై కాటన్ మిల్లు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు కల్లుతో పాటు మద్యం తాపగా, ఆమె మత్తులోకి జారుకునే సరికి ఆమె ఒంటిపై ఉన్న కాళ్ల గొ లుసులు, చేతి కడియాలు తీసుకున్నాడు. చెవులకు ఉన్న బుట్టీ కమ్మలు తీసుకుంటున్న క్రమంలో తన దగ్గర ఉన్న కత్తితో ఆమె చెవిని కోయగా, ఆమె మేలుకొని ప్రతిఘటించింది. దీంతో బు గ్గప్ప ఆమెను అదే కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. అనంతర ం అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకుని తన భార్య ధూపం పద్మకు మొత్తం విషయాన్ని తెలిపి, ఆభరణాలను నగల దుకాణంలో విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
నిందితుడిని పట్టించిన సిసి కెమెరాలు..
అయితే నేరం జరిగిన తర్వాత ఈనెల 8న సమీప పొలాల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, గుర్తు తెలియ ని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు న మోదు చేశారు. 9న ఉదయం కావలి లక్ష్మీ కుటుంబసభ్యులు మృతురాలిని గుర్తించి, ఒంటిపై ఆభరణాలు తీసుకునేందుకే హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించగా, కావలి లక్ష్మీని నిందితుడు ధూపం బుగ్గప్ప బైక్‌పై తీసుకెళ్లినట్లు గుర్తించారు.
ఈ క్రమంలోనే బుధవారం ఉద యం నిందితుడు బుగ్గప్పతో పాటు ఆభరణాలు విక్రయించేందుకు సహకరించిన బుగ్గప్ప భార్య పద్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను గుర్తించడంతో పాటు కేసును త్వరగా చేధించిన మక్తల్ ఎస్సై పర్వతాలు, కానిస్టేబుళ్లు నరేష్, అశోక్, శివారెడ్డి, నరసింహ, హోంగార్డు లక్ష్మణ్‌లను సిఐ కె.రాంలాల్ ప్రత్యేకంగా అభినందించారు.